BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల రానున్న ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేయనుందని సమాచారం. ఉమ్మడి కడప జిల్లా నుంచే ఆమె పోటీ ఉండే అవకాశం ఉందని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు.
షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని.. అయితే, అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు.
వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరారు. షర్మిలకు అధిష్టానం ఏపీలోని కాంగ్రెస్ బాధ్యలను అప్పగించనుందని తెలుస్తోంది.
నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. ఒంటరిగానే ఎన్నికలు వెళ్లాలని, అవసరమైతేనే కమ్యూనిస్టులతో కలవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు షర్మిల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ కానున్నారు. ఈ సమావేశం కేవలం షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికే పరిమితం అవుతుందా? లేక పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.