Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.
రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.