Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు స్వర్ణోత్సవం జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వేడుకలకు రాలేకపోతున్నానని ట్వీట్ చేశారు.
శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'మత్తు వదలరా 2'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
'ఇంద్ర' మూవీకి సంబంధించి నెట్టింట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మూవీ టైమ్ లో చిరు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంద్ర 2002 లో వచ్చింది. ఆ టైంలో చిరుకి 47 ఏళ్ళు. అంటే ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏజ్ తో సమానమన్న మాట.
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్ హాంక్స్ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్ కాలేదని అన్నారు.
మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. నేడు కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ 'తిన్నడు' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. అవ్రామ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు."
ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు.
ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ సందీప్ వంగాతో చేస్తున్న సినిమాలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్ రెండూ ప్రభాసేనని వార్తలు వస్తున్నాయి.