Accident In USA: అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లీ కూతురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు.
వచ్చే నెలలో జరగనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ముక్కోణపు సీరీస్ నుంచి తాము వైదొలుగుతన్నామని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ క్రికెటర్ల చావుకు కారణమైన పాక్‌తో ఇక మీదట ఆడమని తేల్చి చెప్పింది.
వచ్చే ఏడాది 2026లో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో ఆడేందుకు 20 జట్లు కవాలిఫై అయ్యాయి. క్వాలిఫయర్‌లో జపాన్ను ఓడించి యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నాలుగు గ్రూపుల చొప్పున టీమ్‌లను విభజించి...రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షడు మాట్లాడుతూ..ఆ రెండు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపడం నకు చాలా తేలికని అన్నారు. వారి వివాదాన్ని పరిష్కించగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
యుద్ధం ఆపకపోతే తోమహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తానని రష్యాను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..అవి అడగడానికి వచ్చిన జెలెన్స్కీని మాత్రం ఉత్త చేతులతోనే సాగనంపారు. తనకు యుద్ధం ముగియడమే ముఖ్యమని ట్రంప్ చెప్పారు.
పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. వైమానిక దాడులు చేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మరణించారు. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది.
ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అనుమతించింది. అతనిని ఏకాంతంగా నిర్భంధించమని..అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వడంతో దీనికి ఒప్పుకుంది.
తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు.