Movies: విశ్వంభరలో త్రిష డబుల్?
వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఇందులో త్రిషను హీరోయిన్గా తీసుకున్నారు. ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభరలో త్రిష డబుల్ రోల్లో యాక్ట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఇందులో త్రిషను హీరోయిన్గా తీసుకున్నారు. ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభరలో త్రిష డబుల్ రోల్లో యాక్ట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ గామి సినిమా బాక్సాఫీస్ రికార్డ్లను బద్దలు కొడుతోంది. అఘోరా కాన్సెప్ట్‌లో ఒక కొత్త కథతో వచ్చిన విశ్వక్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిలీజ్ అయిన ఒక్కరోజులోనే గామీ మూవీ 9.07 కోట్ల కలెక్షన్ రాబట్టుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో జాన్వీకి ఇదే మొట్టమొదటి సినిమా. ఈరోజు ఆమె బర్త్‌డే. ఈ సందర్భంగా జాన్వీ క్యూట్ లుక్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్.
ప్రస్తుతం హర్రర్ సినిమాల కాలం నడుస్తోంది. కొంచెం వెరైటీగా, భయపెట్టేదిగా ఉంటే చాలు సినిమాలు పెద్ద హిట్ అయిపోతున్నాయి. మమ్మట్టి ప్రధాన పాత్రలో నటించిన భ్రమయుగం సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందా..భయపెట్టిందా అంటే సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.
కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్లతో అర్జున్ రెడ్డి 2.0 గా వచ్చిన సిద్ధార్థ రాయ్ సినిమా శుక్రవారం విడుదల అయింది. యూత్ టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..కొత్త దర్శకుడు సక్సెస్ అయ్యాడా..కింద రివ్యూలో చదవండి.
ఎవరి పేరు చెప్తే, ఎవరిని చూడగానే మన పెదవుల మీద నవ్వు ఆటోమాటిక్‌గా వచ్చేస్తుందో అయనే తెలుగు టాప్ రిచ్చెస్ట్ కమెడియన్ బ్రహ్మానందం. సామాన్య లెక్చరర్ స్థాయి నుంచి వరల్డ్ రికార్డ్ నటుడిగా ఎదిగిన బ్రహ్మానందం పుట్టిన రోజు ఈరోజు.
వేణువై వచ్చాను భువనానికి అంటూ ఏడిపించినా, ఆకు చాటు పిందె తడిసె అంటూ డబుల్ మీనింగ్ పాటలు పాడించినా...పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటూ తత్వం చూపించినా అది ఒక్క వేటూరి వల్లనే సాధ్యమయింది. తెలుగు సినిమాకు పాటసారిగా నిలిచిన వేటూరి సుందర్రామ్మూర్తి జయంతి ఈరోజు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. ఈ మూవీ ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.