Scrolling ప్రకృతి సృష్టించిన విధ్వంసం, ముగ్గురు మృతి గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని విషాదానికి గుర్తులుగా మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పదుల సంఖ్యలో జనం వరదలో గల్లంతయ్యారు ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లావ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling వర్షాల కారణంగా తెలంగాణలో పలురైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం ఎత్తువరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap,Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్, పొంచి ఉన్న మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling CM KCR Meeting: వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Heavy rains in Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన నస్కల్ వాగు తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులూ, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని నస్కల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరదలు రావడంతో వాగుకు జల ప్రవాహం కొనసాగుతోంది. నస్కల్ వాగు ఉగ్రరూపం దాల్చడంతో వరదనీరు జిల్లాలోని ప్రధాన రహదారుల నుంచి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరిసర గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. By Karthik 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn