రాజకీయాలు CPI Narayana: KCR మోసం చేశారు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: నారాయణ తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులని దారుణంగా మోసం చేశారని.. ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అయితే కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. By BalaMurali Krishna 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా? సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకున్నారా? ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం లేదా? ఒక చోట నుంచి తాను పోటీ చేసి.. మరో చోట నుంచి బీఫామ్ ఆ నేతకు ఇస్తున్నారా? ఆసక్తి రేపుతున్న సీఎం కేసీఆర్ లోచనలు. By Shiva.K 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: మహిళా ప్రతినిధుల్లో సరికొత్త జోష్.. కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోటీకి సిద్ధమయ్యారో తెలిస్తే అవాక్కే.. తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు. By Shiva.K 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: గద్వాలలో బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత డీకే అరుణ.. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే ఆరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: ఆ 10 మందికి కేసీఆర్ షాక్.. టికెట్ లేనట్లేనంటూ సంకేతాలు! తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్..!! నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పెండింగ్ బిల్లులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా మరోసారి పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించాననేది కారణాలు మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు.గతంలోనే ఈ సమస్య తీవ్రదుమారం రేపింది.మళ్లీ ఈ సమస్య ఎటువైపు తిరగనుందో వేచి చూడాలి. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రా నేతల చెప్పులు మొయ్యటానికా? బీజేపీ, కాంగ్రెస్ లపై హరీష్ ఫైర్ గజ్వేల్‌లో శనివారం (29-07-2023) మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలువురి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులంటూ మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిని మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. By Shareef Pasha 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn