Big Breaking: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దేవరకద్ర వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సమాచారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దేవరకద్ర వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సమాచారం
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది. అయితే దళిత ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ 'దళిత రత్న' అనే పథకాన్ని తమ మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పలు సబ్సిడీలు, ప్రోత్సహకాలు అందించనున్నట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల పేరు వినబడితేనే ఎప్పుడూ తిట్ల దండకం అందుకునే ఎంపీ అరవింద్.. తాజాగా సీఎం కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్‌ను విమర్శిస్తూ.. ఆయన కన్నా కేసీఆర్ చాలా మంచోడని అన్నారు. రేవంత్‌కు అధికారం వస్తే మొత్తం ముంచేస్తాడని కామెంట్స్ చేశారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నాయకులు ప్రకాశ్ జవదేకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు.
టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది ప్రశాంత్‌కు ప్రశ్నాపత్రం చేరవేశాడు. ప్రశాంత్ ఇండియాకు చేరుకోవడంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఈరోజు గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్యల వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్లో గన్‌తో ఆయన తనకు తానే కాల్చుకొని బలవన్మరణానానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది క్లస్టర్ ఇంచార్జిలతో పాటు.. 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.