Telangana: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న సిద్దు(20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న సిద్దు(20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
యూపీ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ బరిలోకి దిగారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ కేటాయించడంతో జౌన్ పూర్ స్థానం నుంచి శ్రీకళా రెడ్డి పోటీలో నిలిచారు. ఇంతకీ ఎవరీ శ్రీకాళారెడ్డి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు.
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ నిందితులు మోసాలకు పాల్పడ్డారని డీసీపీ కవిత తెలిపారు.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తే.. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామంటూ హెచ్చరించారు.