Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
జూన్ 10న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్త మంత్రులు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో ఉంటున్న నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు యత్నించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఓంఎంఆర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
TGSRTC పేరుతో ఓ కొత్త లోగో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చిక్కడపల్లి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై, అలాగే మరోవ్యక్తి హరీష్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కసరత్తులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
తెలంగాణలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసట ట్రిపుల్ ఐటీ)లో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. టెన్త్ రిజల్ట్స్ వచ్చి మూడు వారాలైనా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.