YS Sharmila: కేసీఆర్ అందుకే ఇలా చేస్తున్నాడు.. షర్మిల షాకింగ్ కామెంట్స్!
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో గెలిచేందుకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీసీ సీఎం చేసే దమ్ము కాంగ్రెస్ కు, దళితున్ని సీఎం చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు.
సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. ఒకవేళ గెలవక పోతే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు.
మంథని నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌పై 89 చొప్పున కేసులు ఉన్నాయి. బండి సంజయ్‌పై 55 కేసులు ఉన్నాయి. కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8, ఈటల రాజేందర్‌పై 40 కేసులు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . ఏడపల్లి మండలం సాటపూర్ గేట్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. బీజేపీ హయాంలోనే రూపాయి విలువ తగ్గిందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం బీజేపీ కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా పీఎం మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. పార్టీకి గట్టి పట్టు ఉన్న దుబ్బాక, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రధాని పర్యటన ఉండేలా ప్లాన్ చేసింది బీజేపీ.