AP News: ఏపీలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి!
ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు.
Andhra Pradesh : ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర... పొంగిన వాగులు... నిలిచిన రాకపోకలు!
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి
ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అల్లకల్లోలంగా శ్రీకాకుళం కడలి..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో శ్రీకాకుళం సముద్ర పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలలు ఎగసి పడుతుండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది.
AP: 25 రోజుల క్రితమే కొత్త ఉద్యోగంలోకి.. కన్నీరు పెట్టిస్తోన్న రాజశేఖర్ కథ!
ఫార్మా కంపెనీ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన పైడి రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. జీతం రూ. 5 వేలు ఎక్కువ వస్తుందని 25 రోజుల క్రితమే అతను ఈ కంపెనీకి మారినట్లు తెలుస్తోంది. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలోనే రాజశేఖర్ ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
AP: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా RTC కాంప్లెక్స్..!
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే గంజాయి, మద్యం బాబులకు RTC కాంప్లెక్స్ నిలయంగా మారిందని మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని అంటున్నారు.
AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..!
పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీకి రాని జగన్‌కు రాష్ట్రంలో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అంతు చిక్కడం లేదని .. నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేసి పని పడతామన్నారు.
AP: ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. అడుక్కుంటే ఎవరూ ఇవ్వరు.. జగన్ పై ఎమ్మెల్యే సెటైర్లు..!
అసెంబ్లీకి రావాలంటే జగన్ భయపడుతున్నాడన్నారు ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ అడుక్కుంటే ఎవరూ ఇవ్వరన్నారు. నామినేషన్ పదవుల విషయంలో మూడు పార్టీల ఏకాభిప్రాయమే శిరోధార్యమన్నారు.
/rtv/media/media_files/1NZSUZTkqcSs4CsX2Bv2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-16-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sklm-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sklm-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/rtc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/jagan-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/jagan-8.jpg)