SLBC RESCUE OPERATION : మట్టి దిబ్బకింద నలుగురు - టన్నెల్ బోర్ కింద మరో నలుగురు!
వారం రోజులుగా సాగుతోన్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎనిమిది మంది ఎక్కడున్నారో రాడార్ సర్వే ద్వారా గుర్తించామని మంత్రి జూపల్లి ప్రకటించారు. మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు