కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.