IND VS AUS: భారతీయులు ప్రార్థిస్తున్నది ఇద్దర్నే.. ఒకరు బౌలర్లు, రెండోది దేవుడిని!
మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచ్‌కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మోదీ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచ్‌కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆస్ట్రేలియాపై జరుగుతున్న ఫైనల్ పోరులో కోహ్లీ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ 750కు పైగా పరుగులు చేశాడు. సెమీస్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్లోగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో బౌండరీ రావడమే గగనమైపోయింది. స్టేడియంలో లక్షా 30వేల మంది సైలెంట్‌గా ఉండిపోయారు. లక్షల మందిని సైలెన్స్‌గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అన్న కమ్మిన్స్ మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
వరల్డ్‌కప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్ అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు.
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్కప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది.
వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్‌కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారే దానిపై ఉత్కంఠ నెలకొంది.
గుజరాత్-గాంధీనగర్‌లోని అదాలజ్ స్టెప్వెల్లో వరల్డ్‌కప్ ఫైనలిస్టులు రోహిత్‌శర్మ, ప్యాట్ కమ్మిన్స్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో వీరిద్దరూ పోజులిచ్చారు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫైట్ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్‌కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ రేస్‌లో తొమ్మిది మంది ప్లేయర్లు ఉండగా.. అందులో భారత్ నుంచి రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమీ ఉన్నారు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఇప్పటికే 700కు పైగా రన్స్ చేయగా.. అటు షమీ 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు.