ఆంధ్రప్రదేశ్ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు-VIDEO శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి మల్లిఖార్జునస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: అమెరికాలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన సాగనుంది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎస్పీ కీలక ప్రకటన! గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారన్న వార్తలపై కృష్ణా జిల్లా ఎస్పీ స్పందించారు. వంశీని అరెస్ట్ చేయలేదని ప్రకటించారు. కానీ.. వంశీ ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వల్లభనేని వంశీ మాత్రం ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్! జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: తెలంగాణలో అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రాష్ట్రంలో తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి పణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందనే నమ్మకం యువతలో కలిగిస్తామన్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు 30 వేల మంది టీచర్లతో రేవంత్ మీటింగ్-LIVE హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదొన్నతి 30 వేల మంది టీచర్లతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతలు సమస్యను పరిష్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సభను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RTV Exclusive Video: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ వయనాడ్ లో ఘోర విపత్తు బాధితులకు సాయం చేయడానికి ఆర్మీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందక్కై-చురాల్మల మధ్య 24 గంటల్లోపే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ఆర్టీవీ ప్రతినిధి అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Manda Krishna Madiga: వెంటనే వర్గీకరణ అమల్లోకి.. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ మార్చాలన్న మందకృష్ణ! ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమల్లోకి తేవాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాలను కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇందుకు అనుగుణంగా సవరించాలన్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లను కూడా ఇలాగే చేపట్టాలన్నారు. తెలంగాణలో మాదిగలకు 12 శాతం, ఏపీలో 7 శాతం దక్కే ఛాన్స్ ఉందన్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం-VIDEO తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. By Nikhil 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn