BIG BREAKING: మరో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం!
తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని శివకాశీలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.
దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్‌లో స్పష్టం చేసింది.
రాజస్థాన్‌లో 4500 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. డీగ్ జిల్లాలోని భాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ASI) చేపట్టిన తవ్వకాల్లో ఇవి వెలుగుచూశాయి. మౌర్యా, శుంగా రాజవంశీయుల కాలం నాటి వస్తువులు, ఆయుధాలు బయటపడ్డాయి.
బాంబే హైకోర్టులో ఓ వింత పిటిషన్ దాఖలయ్యింది. చనిపోయిన తన కొడుకు వీర్యాన్ని నాశనం చేయకుండా అప్పగించాలని కోరుతూ ఓ తల్లి కోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకుండానే తన కొడుకు క్యాన్సర్‌తో మృతి చెందాడని పిటిషన్లో చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఓ భర్త.. దగ్గరుండి వాళ్ల వివాహం జరిపించాడు.
శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథుడి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర నిర్వహిస్తుండగా మూడు ఏనుగులు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లాయి. దీంతో వారు భయంతో పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది.
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.