కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?
కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం.
కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం.
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. దీనికోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు వెంటనే తీసుకుంటామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్‌ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.
కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అయితే తాజాగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ప్రాంతంలో 5 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకున్న భద్రతా బలగాలు బుధవారం జాతీయ పతకాన్ని ఎగురవేశాయి.
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఉగ్రవాదికి పాక్ భద్రత కల్పించడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
పంజాబ్ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఆ నీటిని తమ రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించింది.