India-Pakistan Ceasefire: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న హోల్కర్ స్టేడియాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు చేపట్టగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. ఇలా బెదిరించినవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఎయిర్ రైడ్ సైరన్లను మీడియా ఛానళ్లు కవర్ చేయొద్దని సూచించింది. వీటిని చూపిస్తే ప్రజలు ఇది మాములే అనుకుంటారని.. దీనివల్ల భద్రతకు ముప్పు ఉంటుందని పేర్కొంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల లిస్టును విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
జమ్మూలో పాకిస్థాన్ 8 మిసైల్స్,10 డ్రోన్లతో దాడులకు యత్నించింది. ఒక F16, రెండు F17 ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది. అలాగే F16, రెండు F17 యుద్ధ విమానాలకు కూడా నేలమట్టం చేసింది.
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తు చేశాడని స్పష్టం చేసింది. అయినప్పటికీ దాన్ని తాము ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట విజయవంతంగా దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆపరేషన్ సిందూర్ 2.0కు కూడా ఇండియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి లేదా మళ్లీ ఎప్పుడైనా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరపనున్నట్లు తెలుస్తోంది.