Tamilnadu: భార్య చికెన్ తినలేదని భర్త ఆత్మహత్య
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు.
ఢిల్లీలో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. ఘజియాబాద్, నోయిడా ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ యాపిల్ టెక్ కంపెనీ తమ నాయకత్వ బాధ్యతల్లో మార్పునకు శ్రీకారం చుట్టింది. భారతీయ మూలాలున్న సబిహ్ ఖాన్ ఈ నెల చివర్లో.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) బాధ్యతలు స్వీకరించనున్నారు. యాపిల్ సంస్థలో ఈయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.
ఐఎస్ఎస్లోకి వెళ్లిన తొలి భారతీయ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో ఇస్రో ఛైర్మన్ డా. వి.నారాయణతో ఫోన్లో సంభాషించారు. ఈ మిషన్‌కు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు, శుభాంశు శుక్లా ఆరోగ్యం, ఇతర అంశాల గురించి వీళ్లు చర్చించారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మిగిలింది. మాండ్య జిల్లాలోని కావేరి నదిలో ఆదివారం సాయంత్రం ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ 36 ఏళ్ల ఓ వ్యక్తి అందులో పడి కొట్టుకుపోయాడు.