Sridevi death:శ్రీదేవిది సహజ మరణం కాదు- ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ కపూర్
అందాల తార, జగదేక సుందరి శ్రీదేవి హఠటాత్తుగా మరణించడం అందరినీ తీవ్రంగా కలిచేసింది. ఆమె అకాల మరణం వినోద పరిశ్రమనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనూహ్యంగా శ్రీదేవి చనిపోవడం, అది కూడా అసహజంగా అవడంతో ఆమె మరణం మీద చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను కూడా అనుమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి మౌనంగా ఉంటూన్న బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య మరణం గురించి నోరు విప్పారు. తనది సహజమరణం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.