BREAKING: మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
హీరో మంచు మనోజ్‌కు షాక్ తగిలింది. మనోజ్‌తో పాటు భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హీరో మంచు మనోజ్‌కు షాక్ తగిలింది. మనోజ్‌తో పాటు భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మోహన్ బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు. MBUలో విష్ణు, అతని సహచరుడు వినయ్ కలిసి దోపిడీలు చేయడం ద్వారా అక్కడ చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, వారికి అండగా నిలిచినందుకు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు.
మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ నుంచి ముప్పు ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. తన ఇంటిని మనోజ్ లాక్కున్నాడని అందులో తెలిపినట్లు సమాచారం. మనోజ్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు లేఖలో కోరినట్లు తెలిసింది.
తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరులపై మంచు మనోజ్ పహడిషరిఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారి వివరాలను పోలీసులకు ఇచ్చాడు. హాస్పిటల్ రిపోర్టులను పోలీసులకు అందించాడు. మెడికల్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
మంచు ఫ్యామిలీ గొడవపై పోలీసులు వివరణ ఇచ్చారు. తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పారట.
మంచు ఫ్యామిలీ గొడవలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజులుగా మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా కాస్తున్నారు. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని తెలుస్తోంది.
మంచు మనోజ్ తీవ్ర గాయాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో తన భార్యతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లాడు. మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు.
మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారని వచ్చిన వార్తలపై మంచు ఫ్యామిలీ రెస్పాండ్ అయింది. ఈ మేరకు ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఎవిడెన్స్‌లు లేకుండా అసత్య ప్రచారాలను చేయవద్దని ప్రకటన రిలీజ్ చేసింది.