రాజకీయాలు ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn