Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో యువకుడు శ్యామ్ కుమార్ ను చిత్రహింసలు పెట్టడమేగాక..మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.
కాసేపట్లో నారా లోకేష్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. చంద్రబాబు మీద ఉన్న కేసుల గురించి ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కి వైద్య పరీక్షల నిమిత్తం రానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు.
రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు.
అసలు టీడీపీ భవిష్యత్ కే గ్యారెంటీ లేదు..ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ సభలు ఎందుకని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారని అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అంటూ దుయ్యబట్టారు.
టీడీపీ సంకెళ్ల ఫోటోషూట్ ఐడియా లోకేశ్దేనట.. పరువు తీసుకున్నారంటూ వైసీపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.
చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చారు.