Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు!
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఖమ్మం క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలు గడుస్తున్నా పువ్వాడ దూరంగా ఉండడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం 11 మంది ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే వారిలో నందినికే టికెట్ రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. పదిహేను రోజుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు నమాచారం. వీరందరూ చాలా ఏళ్ళ క్రితమే అక్రమంగా ఇక్కడకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.
సంగారెడ్డిలో మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె పటాన్ చెరు వద్ద కారులో విగత జీవిగా పడి ఉంది. చేతికి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు.
రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాట ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది. మద్యం మత్తులో రేవతి, తెల్దారుపల్లి యూత్ గ్యాంగ్ ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. అడ్డు వచ్చిన SI పై దాడి చేయగా.. ఆయనకు గాయాలు అయ్యాయి. దీనిపై సీపీ సునీల్‌దత్ సీరియస్ అయ్యారు.