ఇంటర్నేషనల్ హమాస్‌కు అండగా ఉంటాం.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోం: హిజ్బుల్లా చీఫ్ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా చీఫ్ సయ్యాద్ హసన్ నస్రల్లా తొలిసారిగా బహిరంగ టీవీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్ని ఆయన సమర్థించారు. హమాస్‌కు అండగా ఉంటామని.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోమని వ్యాఖ్యానించారు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఇక చాలు ఆపండి.. ఇజ్రాయెల్-హమాస్‌కు బైడెన్ పిలుపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణలకు తాత్కాలిక విరామం ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. బందీలను బయటకు తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్ గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ చెబుతోంది. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయం అవుతోంది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఉగ్రవాదుల వివరాలు చెప్పండి.. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఆఫర్.. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర ప్రతిదాడిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గాజాలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా, ప్రశాంతంగా ఉండాలంటే హమాస్ ఉగ్రవాదుల ఆచూకి వివరాలు తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదుల ఉనికిని చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చింది. అలాగే సమాచారం చెప్పిన వారికి ప్రైజ్‌మనీని కూడా అందిస్తామని తెలిపింది. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Barack Obama: గాజాపై ఇజ్రాయెల్ పోరు.. ఆ దేశానికే ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఒబామా.. గాజాపై ఇజ్రాయెల్ తమ దాడులు కొనసాగిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యకుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరికి ఆ దేశానికి బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. గాజాను దిగ్బంధించి.. అక్కడ ఆహారం, నీటి సరఫరా నిలిపివేత వంటి ఆంక్షలతో.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్లలో మరింత ఆగ్రహం పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఈ చర్యలు ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతును కూడా బలహీనపరుస్తాయని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. ఇదే చివరి సంఖ్య కాదని.. కనిపించకుండా పోయిన వారి కోసం ప్రస్తుతం మిలిటరీ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇక హమాస్ దాడి జరిగిన అనంతరం 13 కుటుంబాలకు చెందిన 21 మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారని తాజాగా ఇజ్రాయెల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అల్లకల్లోలంగా మారిన గాజా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn