Israel: ఇరాన్‌ను నాశనం చేస్తాం.. ఇజ్రాయెల్ సంచలన హెచ్చరిక
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్ ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్రభావాన్ని పిల్లల్లో తగ్గించడం కోసం చర్యలకు దిగుతోంది. త్వరలో 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించేలా నిర్ణయం తీసుకోనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు.
అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా సర్కార్ చర్యలపై లాస్ ఏంజెల్స్ అట్టుడుకుతోంది. నాలుగో రోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను తరలించాలని ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా మస్క్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్థి)గా ఉండేందుకు ఎలాన్ మస్క్‌కు ఛాన్స్ ఇస్తామని ప్రకటన చేసింది.
గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి.
ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ వివిధ ప్రాంతాల్లో 117 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇర్క్ట్స్క్ ప్రాంతంలో పలు వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఈ దాడుల కోసం ప్రణాళిక రచించినట్లు జెలెన్స్కీ తెలిపారు.