Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం
హైదరాబాద్‌లోని పాతబస్తీ పురానీ హవేలీలో ఎస్కే అనే ఫుట్‌వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకంది. ఆ షాపులో ఉన్న చెప్పులు, మూడిసరుకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Hanuman Jayanthi : హనుమాన్ శోభయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో.. ఓ యువతి తన ఇంట్లో దొంగలు పడి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. సమాచారం మేరకు పోలీసులు రావడంతో.. చివరికి ఆమె కట్టుకథ అల్లినట్లు తేలింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బు పోవడంతో ఈ డ్రామా చేసిందనట్లు పోలీసులు గుర్తించారు.
Hyderabad: దారుణం.. యువకుడిని చంపేసి రీల్స్ చేశారు
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ యువకుడిని వెంటాడి మరీ దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడిని మేమే చంపేశామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కూడా చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad: సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టిన ఆర్మీ విమానం.. చివరికి
హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. ఆ విమానం హైడ్రాలిక్ వీల్స్ తెరుచుకోకపోవడంతో.. దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి బేగంపేట ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
Hyderabad: రూ.65 లక్షల నిధులు మళ్లించిన అధికారిణి అరెస్టు
నగర చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
Hyderabad : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన షేక్ మజమ్మిల్ అహ్మద్(25) శుక్రవారం కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను అభ్యర్థించారు.
Crime: హైదరాబాద్ విద్యార్థిపై అమెరికాలో దాడి.. ప్రభుత్వానికి అతని భార్య లేఖ..
అమెరికాలో ఉన్నతచదువుల కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మజాహిర్ అలీపై మంగళవారం దాడి జరగడంతో ఆయన భార్య ఫాతిమా.. కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. తన భర్త భద్రతపై ఆందోళనగా ఉందని.. ఆయనకు సరైన చికిత్స అందించాలని.. వీలైతే నన్ను అమెరికా పంపించాలని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T211525.231.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Hanuman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Theft-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/hyd-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Flight-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ali-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ali-2-jpg.webp)