50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది.
ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. కేఎల్ రాహుల్‌కి కొత్త గాయం అవ్వగా అది తెలిసినా కూడా అతడిని సెలక్ట్ చేశారు. మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పడు. ఇలా గాయంతో ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు.
ఆసియా కప్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుండగా.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్, అయ్యర్ ఎలా ఆడుతురాన్నదానిపై అందరిచూపు నెలకొంది. అటు హార్దిక్ పాండ్యా నిలకడలేమి ఫామ్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది.
విండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కెప్టెన్‌గా హార్దిక్ చాలా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏ సమయంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్నదాంట్లో పాండ్యా ఫెయిల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అటు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పాత్రపైనే రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి.
భారత్ ఖేల్ ఖతమైంది. డిసైడర్ టీ20 ఫైట్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్‌మన్ పావెల్ టీమ్ టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విక్టరీ.
India vs Westindies 4th T20: ఇవాళ (ఆగస్టు 12) టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో మార్పులు చేర్పులతో పాండ్యా టీమ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న శుభమన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అటు బౌలింగ్‌లోనూ అర్షదీప్ లేదా ముఖేశ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకునే అవకాశం ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ 8గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఫ్లోరిడాలో మ్యాచ్ కావడంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం.
తత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీలు, నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విండీస్‌తో రెండో టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని రెండో ఫైట్‌లో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్ విక్టరీనే రిపీట్ చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్ కోడ్, డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. 1-1తేడాతో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ సమం చేసింది. శార్థూల్ ఠాకూర్ 3వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 2023 ప్రపంచకప్ దగ్గర పడతున్న వేళ..టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది.