తెలంగాణ కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..! తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది? టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్‌భవన్‌ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరంగల్ లో వరద బాధితులకు గవర్నర్ సహాయం..కేసీఆర్ సర్కార్ కు తమిళి సై కీలక సూచనలు! వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ లేక కేటీఆర్ వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించిన నేపథ్యంలో గవర్నర్ తమిళి సై వరంగల్ లో పర్యటించి బాధితులకు సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn