America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
సాహసాలే జీవితంగా బతుకుతున్నాడు. కానీ అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది. సోషల్ మీడియా కోసం బ్రిటీష్ స్కై డైవర్ చేసిన సాహసం వచివరకు విషాదంగా మిగిలింది. 29వ అంతస్తు నుంచి జంప్ చేస్తూ ప్యారాచూట్ తెరుచుకోకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో హైదరాబాద్ కు చెందిన తెలుగు అమ్మాయి శ్వేత చిరుమామిళ్ళ మృతి చెందారు. అక్కడి రియాల్టో బీచ్ లో సరదాగ గడపడానికి వెళ్ళిన శ్వేతను రాకాసి అల పొట్టనపెట్టుకుంది.
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా మనంత వాడి సమీపంలో కూలీలతో వెళ్తున్న జీపు ఒకటి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపు లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.