Ap Crime: వావివరసలు మరచి.. ఆరునెలల పసికందు పై!
విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటంతో బిడ్డకు తీవ్ర రక్తస్రావమైంది. పాప ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటంతో బిడ్డకు తీవ్ర రక్తస్రావమైంది. పాప ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఆస్తిని మూడో భార్యకి ఇచ్చేస్తాడనే అనుమానంతో కన్న కొడుకు శివ తండ్రి బాడీగార్డ్ తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి..భర్త మృతి చెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది.సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్న క్రమంలో భాను నిద్ర మత్తులో రైలు నుంచి జారి కిందపడింది. ఆమెను రక్షించబోయి సయ్యద్ మృతి చెందాడు.
యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఆటో గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
హైదరాబాద్ సన్ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.