Singer Smita: సింగర్ స్మిత ఇంట్లో కరోనా కలకలం!
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందగా వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో కరోనా వేరియంట్ పుట్టుకొస్తోందని, వీటితో ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఉన్నాయని ఇవి వేరే దేశంలో లేవని ప్రొఫెసర్లు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సాధారణమైందని చెబుతున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరిగే పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు.