Chandrababu Arrest: చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. ఎన్నిరోజులంటే..
ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు.
ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు చెప్పాలనుకునేవి పవన్ కళ్యాణ్‌తో చెప్పిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత జైల్లో కూర్చొని తాను అనుకున్నవి పవన్‌తో చెప్పిస్తున్నాడన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించామన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విజయవాడ ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.