Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడీ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్ఎస్ టికెట్ ఆశించిన తీగల.. టికెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు బేగంపేట బస్తీ వాసులు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తన కొడుకు సోహెల్ ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు.
తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపా దాస్ మున్షీని అధిష్టానం నియమించింది. సోమవారం నాడు ఆమె ఢిల్లీలో ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసి రూ.70 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు.