World cup: 'బుక్ మై షో' వాడి అడ్రెస్ చెప్పండి భయ్యా.. ఇదెక్కడి వెయిటింగ్ టైమ్ బాబోయ్!
ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడుపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న 'బుక్ మై షో'పై సోషల్మీడియా వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. టికెట్ బుకింగ్ సమయంలో సైట్ క్రాష్ అవ్వడం.. వర్చువల్ క్యూలైన్లలో గంటల కొద్ది నిరీక్షించాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.