Andhra Pradesh : వైసీపీ మేనిఫెస్టో విడుదల అప్పుడే..
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
పిఠాపురం కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చేబ్రోలు నుంచి పిఠాపురంలో పాదగయక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
జగన్‌కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ను ఆమె నిలబెట్టగలరా?ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లపై విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
మహాసేన రాజేష్ టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా..అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ చెల్లించకుండా.. అనధికారంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు చేస్తుండగా.. డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. .
జగన్ అంటేనే మోసం, దగ అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. వైసీపీలో గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.