లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ!
రెండవ విడత యువగళం పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు టీడీపీ నేత లోకేష్. పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు లోకేష్.
రెండవ విడత యువగళం పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు టీడీపీ నేత లోకేష్. పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు లోకేష్.
మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. విశాఖ బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఇచ్చారని.. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం విశాఖ బాధితులను ఆదుకోలేదని అని మండిపడ్డారు.
టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం రెండో విడత పాదయాత్రపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 27 నుంచి యువగళం రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. గతంలో జగన్ అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తానని చెప్పి.. ఇప్పుడు విశాఖను రాజధానిగా చేస్తామని అంటున్నారని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విమర్శల దాడి చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీకి భజన చేస్తున్నారని అన్నారు.
విశాఖపట్నంలో 35 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ.. గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ప్రస్తుతం అందుబాటులో ఉందని పేర్కొంది.
సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.