AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!
ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు.
సీఎం జగన్ పై యువగళం పాదయాత్రలో విమర్శలు గుప్పించారు లోకేష్. చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2024లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ డిశ్చార్జ్ అయ్యారు. ఛాతినొప్పితో నిన్న సాయంత్రం మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మంత్రికి యాంజియోప్లాస్టీ చేసినట్లు మణిపాల్ వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ భారత్. టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుందని అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేరారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు.
టీడీపీ బాస్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణపై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి టీడీపీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.