ఆంధ్రప్రదేశ్ దువ్వాడ వాణి సంచలన ఇంటర్వ్యూ-LIVE ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నిన్నటి నుంచి భర్తపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దివ్వల మాధురితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి వాణి ఇస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హత్యా రాజకీయాలు మానుకోండి.. మాజీ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వార్నింగ్.! మాజీ సీఎం జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నాడని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గతంలో హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారన్నారు. కానీ, తమ ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పగలు పాఠాలు.. చీకటి పడితే చిందులు.. ఆ కాలేజీలో నిత్యం జరిగే తంతు ఇదే..! ప్రకాశం జిల్లా మర్రిపూడి జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారింది. కళాశాల సమీపంలోనే బార్‌షాపు ఉండటంతో మందుబాబులు చీకటి పడితే కళాశాల ఆవరణంలో చిందులు వేస్తుంటారు. దీంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్! ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి.. కాకినాడలో పెళ్లి పేరిట మహిళలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణమోహన్ అనే వ్యక్తికి వివాహిత నీరజను పెండ్లికుమార్తెగా చూపించారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని కృష్ణమోహన్ రూ. 6 లక్షలు, బంగారు గొలుసు అందజేశాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు! తిరుపతిలో రూ. 36 లక్షల విలువచేసే అక్రమ మద్యంను పోలీసులు సీజ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 5వేలకుపైగా లీటర్ల మద్యంను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అవయవ దానం చేస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు! గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి రామ్‌ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 12న సీఎం చంద్రబాబు రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn