ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్ తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM YS Jagan Raksha Bandhan Wishes: అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని అక్క, చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. బుధవారం ట్వీట్వర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉండానని మాట ఇస్తున్నా' అని పేర్కొన్నారు సీఎం జగన్. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MOU For Two Pumped Storage Projects: ఏపీలో రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదరనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (AP GENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) సంయుక్తంగా.. ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగా వాట్లు., అనంతపురం జిల్లాలోని కమలపాడులో 1950 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు పీఎస్పీలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణానికి రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయి. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్! ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP MP Bandi Sanjay Sensational Comments: పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య.. బండి సంజయ్ హాట్ కామెంట్స్ పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan Speech: ఏ ఒక్క ఉద్యోగికి తమ ప్రభుత్వం అన్యాయం చేయలేదు: సీఎం జగన్ ట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Kapu Nestham Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.15 వేలు ఆంధ్ర ప్రదేశ్ లో కాపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ నెల 22వ తేదీన కాపు నేస్తం నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్ల లో డబ్బుల్ని జమ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష చేస్తున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్, సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ లో సభ, నెహ్రూ బొమ్మ సెంటర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హెలిప్యాడ్ కు స్థలాలను పరిశీలించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సహాయం అందిస్తుంది. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు వైఎస్సాఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల! ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్ కళ్యాణమస్తు, వైఎస్సాఆర్ షాదీ తోఫా పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది. By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఎస్ఐ సాహసోపేత రెస్య్కూ ఆపరేషన్.. మెడల్ కి సిఫార్సు చేసిన ఏపీ సీఎం స్థానిక ఎస్ఐ వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించారని సీఎం ఎదుటే స్థానికులు మెచ్చుకున్నారు. చాలా మంది ప్రాణాలను ఎస్ఐ కాపాడాలరని కొనియాడారు. స్థానికుల స్పందనతో సమానంగా సీఎం జగన్ కూడా స్పందించారు. గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్ఐను ముఖ్యమంత్రి అభినందించారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn