ఆ ముగ్గురిని ఆస్తి కోసమే చంపేశారు!
ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.
ఈ నెల 6 వ తేదీన జరిగిన మూడు హత్యల కేసులో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు.
వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పవన్ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీని పై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.విశాఖ వేదికగా పవన్ అసూయతో అసత్యాలు మాట్లాడారు. పవన్ అనే అమాయకుడిని చూసి రాష్ట్ర ప్రజలు జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాహి అనే లారీ మీద ఎక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే విమర్శిస్తున్నాడు అంటే అతనికి ఎంతటి అసూయ ఉంతో తెలుస్తుందన్నారు.
తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది.
సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప నటుడిగానే కాదు..గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్ ను సారా లోకేష్ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.