YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టిన ఆమెను ఉండవల్లిలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టిన ఆమెను ఉండవల్లిలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
నెల్లూరు సీటు విషయం లో జాగర్త గా అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానం లో నటుడు అలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలీకి దాదాపుగా అందరు జిల్లా నేతలూ అంగీకారం తెలిపారని తెలుస్తోంది.
ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి ఏపీ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు.
ఈనెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని తెలిపారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో యూనియన్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా విధులకు వచ్చిన పారిశుధ్ధ్య కార్మికురాలిపై దాడి కలకలం రేపింది. ఒకవర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.
కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ చమత్కరించారు. దీంతో, కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరూ ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయిలు తీసుకున్నారని ఆరోపించారు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్. అది నిజమా? కాదా? అని తేల్చడానికి నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ కొడాలి నాని అని కొలికపూడి మండిపడ్డారు.
తిరుపతిలో రోడ్లపై బైఠాయించి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ కళాశాల ఉద్యోగులు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమంను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.