Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఢీకొన్న 158 కార్లు..
అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. కార్చిచ్చుల పొగ, అలాగే సాధారణ పొగమంచు కలిసి వాతావరణ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nuclear-Bomb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Cars-1-jpg.webp)