Tadipatri : తాడిపత్రిలో హైటెన్షన్.. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ V/s సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి..! తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టకపోగా.. ఎమ్మెల్యేతో సీఐ దురుసుగా ప్రవర్తించాడని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 27 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి JC Asmith Reddy : తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. రూరల్ పీఎస్ దగ్గర ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ శ్రేణలు ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లపై..కేసులు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డితో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. అయితే, ఇసుక అక్రమ రవాణాపై రూరల్ సీఐ లక్ష్మీకాంత్ చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. Also Read: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..! ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసుగా మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ సీఐ డౌన్ డౌన్ అంటూ రూరల్ పీఎస్ దగ్గర ఎమ్మెల్యే అస్మిత్, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ నినాదాలు చేపట్టారు. రూరల్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు నిరసన విరమించేది లేదని కార్యకర్తలు భీష్మించుకొని కూర్చున్నారు. Also Read: తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..! ఇదిలా ఉంటే.. ఇసుక అక్రమ రవాణాపైనే ఎమ్మెల్యే అస్మిత్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం స్పందించారు. తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా చేసే వారందరూ ఆప్తులేనని.. దయచేసి వెంటనే ఆ పనులు ఆపేయాలని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావొద్దని వేడుకున్నారు. #jc-asmith-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి