Bollywood: రహస్యంగా వివాహం చేసుకున్న తాప్సీ !

బాలీవుడ్ భామ తాప్సీ పన్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. గత 10 సంవత్సరాలు గా డేటింగ్ చేస్తున్న మథియాస్ బోతోను మార్చి 23న వివాహం చేసుకుంది.

New Update
Bollywood:  రహస్యంగా వివాహం చేసుకున్న తాప్సీ !

తాప్సీ పన్ను తన చిరకాల ప్రియుడు మథియాస్ బోతో పెళ్లి చేసుకోబోతుందని  గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు  గత 10 సంవత్సరాలుగా  డేటింగ్ చేస్తున్నారు. మార్చి నెలలో పెళ్లి జరుగుతుందని కొన్ని వార్తా పత్రికల్లో ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి.కాని వాటిపై వారు ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. కాని ఈ జంట మార్చి 23న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

నటి తాప్సీ పన్ను  మాజీ ఒలింపిక్ పతక విజేత మథియాస్ బో కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 'పెళ్లి ఉదయపూర్‌లో చాలా సన్నిహితంగా జరిగింది. మార్చి 20న ఫ్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ జంట తమ వివాహ విషియాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలని అనుకోలేదు. 

బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు అందలేదు.న్యూస్
బాలీవుడ్ ప్రముఖలు తాప్సీ పన్ను వివాహానికి హాజరు కాలేదు. ఈ నటి పరిశ్రమలోని తన సన్నిహితులైన అనురాగ్ కశ్యప్ , కనికా ధిల్లాన్‌లను మాత్రమే ఆహ్వానించింది. అనురాగ్ కశ్యప్ , తాప్సీ చాలా సినిమాలకు కలసి పనిచేశారు.  'మన్మర్జియాన్' , 'దోబారా' చిత్రాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.కనికా ధిల్లాన్ తాప్సీ నటించిన 'హసీన్ దిల్రూబా', 'మన్మర్జియాన్', 'ఫిర్ ఆయీ ' వంటి చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించారు. కనికా తన భర్తతో కలిసి నటి వివాహానికి హాజరైంది. .తాప్సీ సోదరి షాగున్. ఆమె కజిన్‌తో కలిసి ఉన్న ఫోటోను, ఈ జంట పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: ఆపరేషన్ కర్రెగుట్ట.. మావోయిస్టులను చుట్టుముట్టిన భద్రతాబలగాలు.. భీకర యుద్ధం!

తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 

New Update
Maoists encounter

Police Operation Karrigutta for maoist Security forces action start

Maoist: తెలంగాణ గడ్డపై మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర పోరు జరగనుంది. ములుగు జిల్లా కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుట్టచుట్టూ బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠరేపుతోంది. 

వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు..

ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ములుగు జిల్లా కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. వెయ్యి మందికిపైగా సాయుధ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దీంతో ములుగు జిల్లా పరిసరప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఇదిలా ఉంటే.. సోమవారం జార్ఖండ్ లోనూ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. కీలక నేత వివేక్ కూడా హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు.

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

telangana | telugu-news | today telugu news police 

Advertisment
Advertisment
Advertisment