T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కు ఈ ముగ్గురు యంగ్‌స్టర్స్‌కు జట్టులో పక్కా..! ఐపీఎల్ 2024 తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. జూన్ 1 ( June)నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.అయితే ఐపీఎల్ 2024లో సత్తా చాటుతున్న ముగ్గురు క్రికెటర్లను తప్పకుండా జట్టులో తీసుకుంటారని వాదనలు వినిపిస్తున్నాయి.వారెవరో చూసేయండి! By Durga Rao 27 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రపంచ కప్ ఆడే దేశాలు మే 1 (May)నాటికి ప్లేయర్లను సెలక్ట్ చేయాల్సి ఉంది. దీంతో బీసీసీఐ(BCCI) సెలక్టర్లు ఇప్పటికే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టారు. అయితే ఈ ఐపీఎల్‌లో సక్సెస్ అయిన ప్లేయర్లపై సెలక్టర్లు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ముగ్గురు యంగ్‌స్టర్స్ కచ్చితంగా టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్‌కు సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది. * సెలక్టర్ల దృష్టిలో.. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్ వంటి కీలక ఆటగాళ్లు అప్పుడప్పుడూ భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నా, నిలకడ ప్రదర్శన చేయట్లేదు. లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోని మరికొందరు ఇంటర్నేషనల్ క్రికెటర్లకు టీ20 సమరానికి దారులు దాదాపు మూసుకుపోయినట్లేనని భావించాలి. కానీ లీగ్‌లో అదరగొడుతున్న అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ బిగ్ టోర్నీకి సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఈ ముగ్గురు క్రికెటర్లు సత్తా చాటారు. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బ్యాటుతో అద్భుతాలు చేస్తుండగా, బౌలర్ మయాంక్ యాదవ్ ఇంప్రెస్ చేశాడు. లీగ్‌లో వీరి అద్భుతమైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, టీ20 సమరానికి వీరిని సెలక్ట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. * రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, ఐపీఎల్ 2024లో బ్యాటుతో సత్తా చాటుతున్నాడు. గత సీజన్‌లో అతడు విఫలమైనప్పటికీ, ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో పరాగ్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 161.42 స్ట్రైక్ రేట్‌తో 318 పరుగులు చేశాడు. * అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఐపీఎల్ 2024కి ముందు పెద్దగా అంచనాలు లేని ఈ బ్యాటర్.. SRH విజయాలకు బలమైన పునాది వేస్తున్నాడు. ఈ 23 ఏళ్ల యంగ్‌స్టర్ లీగ్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 36.71 సగటు, 215.97 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ పొజిషన్‌కు అతడు పూర్తి అర్హుడేనని చెప్పుకోవచ్చు. ఈ టాలెంటెడ్ బ్యాటర్ భారత స్క్వాడ్‌కు ఎంపికైతే, T20 ప్రపంచ కప్ 2024 ప్లేయింగ్ XIలో కచ్చితంగా ఉంటాడు. * మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు అవసరమైన, అనుకూలమైన బౌలర్. ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌ల్లో భారీ వేగంతో నిలకడగా బంతులు వేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. తర్వాత గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ యంగ్ పేసర్ LSG తరఫున 3 మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అతనిదే. T20 ప్రపంచ కప్ ప్రారంభమయ్యే సమయానికి మయాంక్ కోలుకుని భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. #t20-world-cup-2024 #team-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి