T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాంగ్!

జూన్ లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అయితే తాజాగా ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను విడుద‌ల‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

New Update
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాంగ్!

T20 World Cup 2024: ఈ ఎడాది జూన్ లో టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.జూన్‌ 1 నుంచి  ప్రారంభమై  ఈ పొట్టి ప్రపంచ కప్ జూన్ 29 న ముగుస్తుంది.తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌ (Team India), పాకిస్థాన్‌ (Pakistan) జట్లు ఉన్నాయి.

దాయాదుల సమరం కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠగా జరిగే ఈ  సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌నకు ఐసీసీ రిజర్వ్‌ డేలను ప్రకటించింది.

Also Read: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!

టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసిన స్టార్ స్పోర్ట్స్
ఈ క్రమంలో ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను రిలీజ్  చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అనే క్యాప్షన్‌తో ఎక్స్ వేదిక‌గా ఈ వీడియోను పంచుకుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం 'వందేమాత‌రం'ను ప్లే చేయ‌డం జ‌రిగింది. వీడియోలో భార‌త జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాల‌ను చూపించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  చివరలో కోహ్లీ సెల్యూట్‌ చేస్తున్న క్లిప్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతుంది.

ఈసారి పెరిగిన జట్ల సంఖ్య 
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి.

టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి.

ఆ మూడు మ్యాచ్‌లకు..
టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్‌ మ్యాచ్‌లూ జూన్‌ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్‌ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌
ఇండియా vs ఐర్లాండ్‌ - జూన్‌ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్‌ - జూన్‌ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్‌ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్‌ 15 (ఫ్లోరిడా)
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment