Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలివే! బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించలేక బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్నారు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దానిని ముందుగా ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం! By Durga Rao 03 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Brin Stroke Symptoms : ప్రస్తుత సమాజంలో బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించలేక బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్నారు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దానిని ముందుగా ఎలా గుర్తించవచ్చు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? వంటి అంశాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. మెదడుకు సరిగ్గా రక్తప్రసరణ(Blood Circulation) జరగకపోయినా, లేదా మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీటిని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. బలహీనం, తిమ్మిర్లు.. ఇలా ఎన్నో లక్షణాలు ఇక వాటిని గుర్తిస్తే తీవ్రమైన ప్రమాదం బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. శరీరమంతా తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మాటలు నత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ కు గురవుతారు. మెదడుకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖంపై తీవ్రమైన ప్రభావం చూపు మందగిస్తుంది. ఒక్కోసారి రెండు కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ముఖంలో మార్పు వస్తుంది. ఒక వైపుకు ముఖం జారిపోయినట్టుగా మారుతుంది. స్ట్రైట్ గా నిలబడడంలోను ఇబ్బంది వస్తుంది. శరీరంపై అదుపు తప్పుతుంది. చేతులు కూడా బలహీనంగా మారుతాయి. ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రంగా ఉన్నప్పుడు స్పృహ కూడా కోల్పోయే అవకాశం(Loss Of Consciousness) ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండానే కాపాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే త్వరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. లేట్ చేసే కొద్దీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. Also Read : మీ ముక్కు లేదా చెవులు కుట్టిన తర్వాత ఈ చిట్కాలు అనుసరించండి.. ఎప్పటికీ నొప్పి ఉండదు! #brain-stroke #blood-circulation #consciousness మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి