Swag Teaser: 'స్వాగ్' టీజర్ ఔట్.. శ్రీ విష్ణు రఫ్పాడించాడుగా..!

హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌ 'స్వాగ్'. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో పీరియడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సన్నివేశాలు, శ్రీ విష్ణు కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

New Update
Swag Teaser: 'స్వాగ్' టీజర్ ఔట్.. శ్రీ విష్ణు రఫ్పాడించాడుగా..!

రీసెంట్ గా ‘ఓం భీం బుష్’ సినిమతో అలరించిన యంగ్ హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంట‌ర్‌టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న 'స్వాగ్' సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో పీరియడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సన్నివేశాలు, డ్యూయల్ రోల్ లో శ్రీ విష్ణు కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నటి రితూ వర్మ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ఇక్కడ టీజర్ ఎంబెడ్ చేయండి

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి మీరా జాాస్మిన్, రీతూ వర్మ ఫీమెల్ లీడ్స్ గా నటిస్తున్నారు. దక్ష నగార్కర్, శరణ్య , గెటప్ శ్రీను, గోప రాజు రమణ, ప్రదీప్, సునీల్, రవిబాబు, త‌దిత‌రులు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read: మూడుసార్లు ఫోన్లు..మూడు రకాల సమాధానాలు..ఆర్జీకర్ ఆసుపత్రి తీరులో అనుమానాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు